మళ్లీ భయపెడుతున్న కరోనా.. తాడేపల్లిలో ఇద్దరికి పాజిటివ్
రాష్ట్రంలో కరోనా మహమ్మారి పోయింది అనుకుంటున్న తరుణంలో మళ్లీ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో కరోనా మహమ్మారి పోయింది అనుకుంటున్న తరుణంలో మళ్లీ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా కేసులు నమోదు అవుతున్న తరుణంలో అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే కేంద్రం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే తెలంగాణలోని హైదరాబాద్‌లో కరోనా కేసులు నమోదు అవ్వడం ఆందోళన కలిగించింది. తాజాగా ఏపీలోని గుంటూరు జిల్లాలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
తాడేపల్లికి చెందిన ఇద్దరు అనారోగ్యంతో బాధపడుతున్నారు. జ్వరం, ఒళ్లంతా చెమటలు పట్టడంతో అనుమానం వచ్చి వారు గుంటూరు ఆస్పత్రికి వెళ్లారు. కరోనా పరీక్షలు చేయించుకోగా ఇద్దరికీ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు జిల్లా వైద్యాశాఖాధికారి శ్రావణ్ బాబు వెల్లడించారు. ఇద్దరికీ మెడిసిన్ ఇచ్చి హోం ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. కరోనా కేసులు నమోదు అవుతున్న క్రమంలో ప్రజలు మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు.
ఇవి కూడా చదవండి : Tragedy: 16 నెలల చిన్నారి ప్రాణం తీసిన చెట్లు